మెహబూబా ముఫ్తీకి మరో మూడునెలల పాటు నిర్బంధం

మెహబూబా ముఫ్తీకి మరో మూడునెలల పాటు నిర్బంధం
X

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నిర్బంధం గడువును మరో మూడునెలల పాటు పెంచారు. ఆమెతో పాటు అలీ ముహమ్మద్ సాగర్, సర్తాజ్ మదానీలకు కూడా నిర్బందం పొడిగించారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాజకీయ ప్రముఖులను నిర్బంధంలో ఉంచారు. మాజీ సీఎం మెహబూబా నివాసముంటున్న ఫెయిర్ వ్యూ ఇంటినే సబ్సిడరీ జైలుగా మార్చి అందులో నిర్బంధంలో ఉంచారు.పీడీపీ నేతలు సాగర్, మదానీలను గుప్ కర్ మార్గంలోని ప్రభుత్వ భవనంలో ఉంచారు. గతంలో లాల్ చౌక్ మౌలానా ఆజాద్ రోడ్డుపై ఉన్న ప్రభుత్వ అతిధి గృహంలో మెహబూబాను ఉంచినా, తర్వాత ఆమె ఇంటికి మార్చారు.

Next Story

RELATED STORIES