అమెరికాలో మరో వైరస్ కలకలం

ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోన్న కరోనా.. అమెరికాలో స్వైర విహారం చేస్తోంది. కరోనా వైరస్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. అమెరికా వ్యాప్తంగా కరోనావైరస్ భయం గుప్పిట్లో చిక్కుకున్న ప్రజలను ఇప్పుడు మరో వైరస్ మరింత భయపెడుతోంది. 2 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలు కరోనా మహమ్మారి బారి నుంచి తప్పించుకున్నామనకునేలోపే అంతుచిక్కని మరో అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారంతా కరోనా నుంచి కోలుకున్నవారే కావడం గమనార్హం. అసలు ఈ వ్యాధి ఏంటి? కరోనాకు సంబంధించినదేనా లేదా వేరేదేమైనా అని నిపుణులు ఆలోచనలో పడ్డారు. ఈ వ్యాధిని ‘మిస్టీరియస్‌ సిండ్రోమ్‌’గా పిలుస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story