ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్

ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్

ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా ముస్తఫా ఖాద్మీని గురువారం పార్లమెంటు ఎన్నుకుంది. అమెరికా దేశ మద్ధతుదారు అయిన ముస్తఫా ఖాద్మీ గతంలో ఇరాక్ దేశ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఇరాక్ దేశ భద్రత, స్థిరత్వం, వికాసానికి తాను పనిచేస్తానని ఇరాక్ కొత్త ప్రధాని ముస్తఫా ఖాద్మీ ట్వీట్ చేశారు. ఇరాక్ దేశంలో ప్రబలుతున్న కరోనా వైరస్ పై పోరాటానికి తాను ప్రాధాన్యమిస్తామని ముస్తఫా ప్రకటించారు.

గతంలో వేలాది మంది ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. ఇరాక్ పాలకులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో నవంబరులో అదెల్‌ అబ్దుల్‌ మహ్దీ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story