ఈ అనర్ధానికి కారణం.. ఎల్‌జీ పాలిమర్స్ యజమానుల నిర్లక్ష్యం..

ఈ అనర్ధానికి కారణం.. ఎల్‌జీ పాలిమర్స్ యజమానుల నిర్లక్ష్యం..

ప్రతి రోజు కొన్ని వందల టన్నుల వ్యర్థాలను విడుదల చేస్తుంటాయి పరిశ్రమలు. అందుకే వాటిని ఊరికి దూరంగా నిర్మిస్తుంటారు. పరిశ్రమల చుట్టుపక్కల ఉండడానికి ఎవరూ సాహసించరు. ఆ వాయువులను పీల్చిన ప్రజలు తీవ్ర అస్వస్థతలకు గురవుతుంటారు. కానీ ఎల్‌జీ పాలిమర్స్ ఊరి మధ్యలో ఉంది. ప్యాక్టరీకి దగ్గరలోనే నివాస స్థలాలు ఉన్నాయి. లాక్డౌన్ ఉన్నా పరిశ్రమలు రోజూ మెయింటైన్ చేయాల్సి ఉండగా దాన్ని వారు పట్టించుకోలేదు.

సడలింపుల అనంతరం తెరుచుకున్న ఫ్యాక్టరీలో సరైన ప్రమాణాలు పాటించని కారణంగా వందలాది మంది ప్రమాదంలో చిక్కుకున్న పరిస్థితి ఏర్పడింది. 45 మందికి మెయింటినెన్స్ పాస్‌లు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇంతటి ప్రమాదానికి కారణమయ్యారు. ఫ్యాక్టరీ ట్యాంకుల్లో దాదాపు 2 వేల మెట్రిక్ టన్నుల స్టెరెన్ నిల్వ ఉంది. 20 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండాలి ఫ్యాక్టరీలో కానీ ఆ ఏర్పాటు చేయలేదు యాజమాన్యం. దానికి తోడు బయటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగి పోవడం.. స్టెరెన్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు గ్యాస్ వేగంగా వ్యాప్తి చెందింది. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా, 200 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గ్యాస్ లీకేజీల విషాద చరిత్ర భారతదేశానికి కొత్త కాదు. 1984లో కేంద్ర నగరమైన భోపాల్‌లోని ఒక ప్లాంట్‌లో కూడా ఇదే విధంగా రసాయన లీకేజీ జరిగి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విపత్తుగా గుర్తించబడింది. దాని ప్రభావం కారణంగా 35 సంవత్సరాల తరువాత కూడా కొందరికి పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story