ఎవరిదీ ఎల్‌జీ పాలిమర్స్.. గ్యాస్ లీకేజీని గుర్తించిందెవరు

ఎవరిదీ ఎల్‌జీ పాలిమర్స్.. గ్యాస్ లీకేజీని గుర్తించిందెవరు

ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరం ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగి భారీగా రసాయన వాయువుల లీకేజీ జరిగింది. గురువారం తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో పరిశ్రమ నుంచి విషవాయువులు లీకవుతున్నట్టు తెలిసింది. అప్పటికే మూడు నాలుగు కిలోమీటర్ల దూరం వరకు వాయువు వ్యాపించినట్లు స్థానికుల మాటల ద్వారా వ్యక్తమయింది. ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో ఉన్న ఎల్జీ కెమ్ సంస్థకు సంబంధించింది. లాక్డౌన్ కారణంగా మూతబడిని ఫ్యాక్టరీలో రాత్రి డ్యూటీలో ఉన్న గార్డు ముందుగా గ్యాస్ లీకేజీని గుర్తించారు.

అత్యవసర సర్వీసుల సిబ్బంది వెంటనే స్పందించి సమీపంలోని 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేసి అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ప్రస్తుతం ప్రమాద తీవ్రతను అంచనా వేస్తున్నామని ఎల్జీ కెమ్ తెలిపింది. ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రజలను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఎల్జీ యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో 130మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. వివిధ ఆస్పత్రుల్లో మరో 250 మంది వరకు చికిత్స పొందుతున్నారని ఎల్జీ కెమ్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story