Top

అన్ని చర్యలు తీసుకోండి.. అందర్నీ కాపాడండి: ఏపీ సీఎం

అన్ని చర్యలు తీసుకోండి.. అందర్నీ కాపాడండి: ఏపీ సీఎం
X

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ రసాయన కర్మాగారంలో జరిగిన గ్యాస్ లీక్ సంఘటన గురించి స్వయంగా తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్లారు. ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి నేరుగా కింగ్ జార్జ్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. చికిత్స పొందుతున్న 196 మంది పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు సీఎంకు వివరించారు.

ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడడానికి మరియు పరిస్థితిని అదుపులోకి తీసుకురావాడానికి సాధ్యమైనంత మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జిల్లా అధికారులను ఆదేశించారు. అనంతరం ఆంధ్రా మెడికల్ కళాశాల డిజిటల్ క్లాస్ రూంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం విచారకరం అని సీఎం అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు.

Next Story

RELATED STORIES