ఎల్‌జీ పాలిమర్స్.. ఏంటీ విషవాయువు.. ఎందులో ఉపయోగిస్తారు..

ఎల్‌జీ పాలిమర్స్.. ఏంటీ విషవాయువు.. ఎందులో ఉపయోగిస్తారు..

అసలే కరోనా మహమ్మారి ధాటికి తట్టుకోలేక లాక్టౌన్ పేరుతో ఇళ్లలో ఉంటున్న జనం మీద పిడుగు పడ్డటైంది వైజాగ్ ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకైన విషయం. అర్థరాత్రి ఆదమరిచి నిద్ర పోతున్న వారిని గ్యాస్ కబళించింది. నిద్రలోనే ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయిన వారు కొందరైతే,, మరి కొందరు గ్యాస్ వాసనకు తట్టుకోలేక స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయారు. దాదాపు 200 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని వైద్య బృందాలు చెబుతున్నాయి.

విషయవాయువు ధాటికి తట్టుకోలేక రోడ్ల మీదకు పరిగెట్టి కుప్పకూలిపోయారు. అయితే ఈ ఫ్యాక్టరీ నుంచి లీకైన గ్యాస్ చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఈ గ్యాస్‌ను పీవీసీ గ్యాస్ లేదా స్టెరిన్ గ్యాస్ అంటారు. సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్, డిస్పోసబుల్ కప్పులు, కంటైనర్లు, ఇన్సులేషన్ ఇలా పలు ఉత్పత్తులకు వాడతారు. దీనికి రంగు ఉండదు. తీయటి వాసన ఉంటుంది. రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు గ్యాస్ ప్రభావం వుంటుంది. గ్యాస్ పీల్చిన క్షణాల్లోనే మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

బాధితులకు చికిత్స అందకపోతే ప్రాణాలు కోల్పోతారు. గ్యాస్‌ను పీల్చిన వెంటనే క్షణాల్లో చర్మంపై దద్దుర్లు వస్తాయి. కంటిచూపుపై ప్రభావాన్ని చూపిస్తుంది. తలనొప్పి , కడుపులో వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతుంది. పశుపక్ష్యాదులపై కూడా ఈ గ్యాస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చెట్టు సైతం నల్లగా మారిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story