విశాఖ గ్యాస్ లీక్.. వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ నేవీ

విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో వెంటనే స్పందించి 250 కుటుంబాలను కాపాడామని ఎన్టీఆర్‌ఎఫ్‌ డైరక్టర్ జనరల్ ప్రధాన్ తెలిపారు. విశాఖలో ఆర్ఆర్‌పురంలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి హానికారక స్టెరీన్ గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనపై ఎన్డీఆర్‌ఎఫ్( నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్)‌, ఎన్‌డీఎంఏ( నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర యంత్రాంగానికి అందుబాటులోకి వచ్చి కనీసం 250 కుటుంబాలను కాపాడామని ప్రధాన్ తెలిపారు. ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇంటింటికీ వెళ్లి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయన్నారు. తమ బృందాలు చేరుకునే సరికి అనేక మంది అపస్మార స్థితిలో ఉన్నారని తెలిపారు. తాము కాపాడిన వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారని ప్రధాన్ తెలిపారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు తమ బృందాలు అక్కడే ఉంటాయని చెప్పారు. సుమారు 500 మందిని హాస్పిటల్‌కి తరలించామని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story