విశాఖ గ్యాస్ లీక్‌పై అధికారులతో మాట్లాడిన ప్రధాని మోదీ

విశాఖలో ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. ఈ ఘటనలో ఇప్పటికే 8 మంది మృతి చెందారు. ఆర్ఆర్ వెంకటాపురంలో ముగ్గురు మృతి చెందగా, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు బాధితులతో కేజీహెచ్ ఆసుపత్రి కిక్కిరిసిపోయింది.
ఈ నేపథ్యంలో విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ప్రధాని మోదీ అధికారులతో మాట్లాడారు. హోంమంత్రిత్వ శాఖ అధికారులు అదేవిధంగా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి అధికారులతో మాట్లాడారు. విశాఖపట్నం పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్న ప్రధాని అన్ని రకాల సహాయ సహకారాలను, మద్దతు అందజేయనున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com