Top

ప్రేమించలేదని గొంతు కోసిన ప్రేమోన్మాది

ప్రేమించలేదని గొంతు కోసిన ప్రేమోన్మాది
X

తనను ప్రేమించలేదన్న కారణంతో ఓ ఆటోడ్రైవర్‌.. 14 ఏళ్ల బాలిక గొంతు కోసిన ఘటన.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని గుత్తి అనంతపురంలో జరిగింది. బాధితురాలు స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సన్నీ అలియాస్‌ రామాంజనేయులు అనే యవకుడు.. గత కొంతకాలంగా ప్రేమించాలంటూ బాలికను వేధిస్తున్నాడు. శుక్రవారం ఉదయం బాలిక తల్లిదండ్రులు ఉపాధి పనులకు వెళ్లగా.. రామాంజనేయులు.. ఆమె ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానన్నాడు. అంతటితో ఆగకుండా... బ్లేడుతో బాలిక గొంతు కోశాడు. ఆ ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ బాలికను.. స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రి తరలించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో.. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story

RELATED STORIES