విధుల్లో చేరని 400 మంది వైద్యులకు ఉద్వాసన

విధుల్లో చేరని 400 మంది వైద్యులకు ఉద్వాసన
X

విధుల్లో చేరని 400 మందికి పైగా వైద్యులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం సర్వీసుల నుంచి తొలగించింది. వీరంతా విధుల్లో చేరడం గానీ, ప్రొబెషన్ పీరియడ్ పూర్తి చేయడం కానీ చేయలేదు. దాంతో వీరందరి సర్వీసును రద్దు చేసింది. వీరి స్థానంలో నూతన వైద్యుల నియామకం చేపడతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో 145 మంది వైద్యులను విధుల్లో చేరాలని హెచ్చరించినా ఎటువంటి స్పందన లేదని దాంతో వారందరినీ తొలగిస్తున్నామని చెప్పింది. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం 2 వేల మందికి పైగా వైద్యుల, 1500 మంది పారామెడికల్ సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తిని నిర్మూలించేందుకు వైద్య విద్య ఆఖరి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులను తక్షణమే ఇంటర్న్‌షిప్ ప్రారంభించాలని ప్రభుత్వం కోరింది.

Next Story

RELATED STORIES