Top

ఇరాన్‌లో భూకంపం

ఇరాన్‌లో భూకంపం
X

ఒక వైపు కరోనా మహమ్మరితో ఇరాన్‌‌ గజగజ వణికిపోతుంటే.. మరొవైపు భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఉత్తర ఇరాన్ దేశంలో గురువారం అర్దరాత్రి భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఇరాన్ దేశంలో ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు.

Next Story

RELATED STORIES