విశాఖలో మరోసారి గ్యాస్ లీక్.. కర్మాగారంలో గ్యాస్‌పై శాస్త్రవేత్తలు పరిశోధన

విశాఖలో మరోసారి గ్యాస్ లీక్.. కర్మాగారంలో గ్యాస్‌పై శాస్త్రవేత్తలు పరిశోధన

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ కెమికల్ కంపెనీలో గురువారం అర్దరాత్రి మరోసారి విషవాయువు వెలువడింది. దీంతో విశాఖ శివార్లలోని గోపాలపట్నం, పెందుర్తి, ఆడివివరం, పినగాడి, సింహాచలం, వేపగుంట, బాజీ జంక్షణ్, ప్రహ్లాదపురం ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చారు.

అయితే ఈ గ్యాస్ లీకేజ్‌ని నివారించేందుకు పూణే నగరం నుంచి ప్రత్యేకంగా 9 మంది పర్యావరణ పరిశోధక సంస్థ శాస్త్రవేత్తల బృందం వైజాగ్ వెళ్లారు. ఒకవైపు మళ్లీ గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలో న్యూట్రలైజర్ సాయంతో కంపెనీ లోపల నుంచి గ్యాస్ లీక్ కాకుండా గడ్డ కట్టేలా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్యాస్ లీక్ తీవ్రత ప్రజలపై ఏమేర ఉంటుందనే విషయంపై పర్యావరణ పరిశోధక శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు. కెమికల్ కర్మాగారంలో గ్యాస్ పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story