ఖైదీల్లో కరోనా.. 11 వేల మంది ఖైదీలకు బెయిల్

ఖైదీల్లో కరోనా.. 11 వేల మంది ఖైదీలకు బెయిల్

నేరాలు, ఘోరాలు చేసి జైళ్లలో మగ్గుతున్న ఖైదీలకు కరోనా సోకడంతో జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ముంబై నగరంలోని ఆర్థర్ రోడ్ జైలులో 103 మందికి వైరస్ సోకింది. కరోనా సోకిన ఖైదీలను, జైలు ఉద్యోగులను శుక్రవారం ఉదయం ఆస్పత్రులకు తరలించారు. గతంలో మాదకద్రవ్యాల కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. అతనికి పాజిటివ్ అని వచ్చింది దాంతో అతడితో పాటు ఉన్న మిగతా ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కోవిడ్ రోగులున్న కస్తుర్బా ఆస్పత్రికి ఎదురుగా ఆర్థర్ రోడ్ జైలు ఉంది. నిత్యావసరాలు సరఫరా చేసే వ్యక్తుల ద్వారా కరోనా సోకి ఉంటుందని జైలు అధికారులు భావిస్తున్నారు. నిజానికి ఈ జైల్లో 800 మంది ఖైదీలను మాత్రమే ఉంచాలి. కానీ 2600 మంది ఉన్నారు. దాంతో రద్దీగా ఉండడంతో కరోనా వచ్చి వుంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, జైల్లో కరోనా కేసులు వెలుగు చూసినందున చిన్న చిన్న నేరాలు చేసి జైల్లో ఉన్న 11 వేల మంది ఖైదీలను విడుదల చేసే యోచనలో ఉంది మహారాష్ట్ర సర్కారు. హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఖైదీల బంధువులు వారికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే న్యాయవాదులను సంప్రదిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story