విశాఖ గ్యాస్ లీక్.. 12కు చేరిన మృతుల సంఖ్య

విశాఖ నగరంలో ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కేజీహెచ్ ఆస్పత్రిలో మూడు వార్డుల్లో 193 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో 47 మంది చిన్నారులు ఉన్నారు.
అటు.. కెమికల్ ఎఫెక్ట్‌తో బాధితులు గురువారం రాత్రంతా నిద్రలేక ఇబ్బంది పడ్డారు. కళ్ల మంట, చర్మంపై దద్దర్లు వచ్చి మంట పుట్టడంతో సమస్య ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి మరోసారి గ్యాస్ లీకైందన్న వదంతులు చెలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
స్టైరిన్ గ్యాస్ లీకేజీ విషయంలో వదంతులు నమ్మవద్దని విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కేమీనా తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు వివరించారు. ప్రజలందరూ ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండవచ్చని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com