జాతీయం

కమల్ గారూ.. కాస్తైనా ఆలోచించి మాట్లాడాలి కదా.. అంత గొప్ప వ్యక్తిని అలా..

కమల్ గారూ.. కాస్తైనా ఆలోచించి మాట్లాడాలి కదా.. అంత గొప్ప వ్యక్తిని అలా..
X

కమల్ గారు మీరు గ్రేట్ యాక్టర్ కావచ్చు. మీకు ధీటుగా నటించే వారు లేకపోవచ్చు. కానీ ఓ గొప్ప వ్యక్తిని అలా కించపరుస్తూ వ్యాఖ్యానించడం భావ్యం కాదు అని నటుడు కమల్‌ హాసన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన త్యాగరాజస్వామిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. తమిళ్ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్న కమల్ పలు ఆసక్తికర విషయాలు చర్చించారు. అందులో భాగంగానే సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. సినిమా అంటే టిక్కెట్లు అమ్మి డబ్బు సంపాదించే వ్యాపారం. ఛారిటీ కాదు.

త్యాగరాజ స్వామిలా తంజావూరు వీధుల్లో రాముడిని కీర్తిస్తూ బిచ్చమెత్తుకోవడం కాదు అని కమల్ వ్యాఖ్యానించాడు. దాంతో కమల్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. త్యాగరాజ స్వామిని దేవుడిలా కొలిచే ఎంతో మంది కర్ణాటక సంగీతకారులు కమల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతో సంగీతకారుడు పాల్‌ఘాట్ రామ్ ప్రసాద్ ఆన్‌లైన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు మద్దతుగా ఇప్పటికే 16 వేల మంది సంతకాలు చేశారు.

Next Story

RELATED STORIES