కబడ్డీ ప్లేయర్‌ని కాల్చి చంపిన పోలీస్..

కబడ్డీ ప్లేయర్‌ని కాల్చి చంపిన పోలీస్..
X

కారు పార్కింగ్ గొడవ ఓ ప్రముఖ కబడ్డీ ప్లేయర్ ప్రాణాలు తీసింది. పంజాబ్ కపుర్తాలా జిల్లాకు చెందిన కబడ్డీ ప్లేయర్ అర్విందర్ జీత్ సింగ్ గురువారం రాత్రి తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) కారులో రైడింగ్‌కు వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు రోడ్డు పక్కన పార్క్ చేసి అందులో కూర్చుని స్నేహితులతో కబుర్లు చెబుతున్నాడు. అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్‌లో భాగంగా ఏఎస్సై పరంజీత్‌సింగ్ అటుగా వచ్చారు. ఇక్కడెందుకు పార్క్ చేశారు అని అడిగితే సమాధానం చెప్పకుండా స్పీడుగా దూసుకుపోయాడు. దీంతో ఎస్సైకి అనుమానం వచ్చి కారును వెంబడించారు.

పోలీసుల నుంచి తప్పించుకోవడం కష్టం అని భావించిన అర్విందర్ కారు ఆపి తనతో పాటు కారులో ఉన్న వ్యక్తుల వివరాలు చెప్పాలనుకున్నాడు. కానీ ఇంతలోనే ఏఎస్సై అర్విందర్‌పై కాల్పులు జరిపారు. దీంతో అర్విందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడు ప్రదీప్‌ సిగ్‌కి గాయాలయ్యాయి. కాగా, అర్విందర్ స్నేహితుల ఫిర్యాదు మేరకు ఏఎస్సైపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

Next Story

RELATED STORIES