ఎల్జీ పాలిమర్స్ ఘటన.. ప్రాణం తీసిన పరుగు..

ఎల్జీ పాలిమర్స్ ఘటన.. ప్రాణం తీసిన పరుగు..

గ్యాస్ లీకవుతోంది.. త్వరగా బయటకు రండి. ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోండి అని గాఢ నిద్రలో ఉన్న వారిని తలుపులు బాది మరీ ప్రాణాలు కాపాడుకోమని చెబుతుండే సరికి దిక్కు తోచని స్థితిలో తలో దిక్కూ పరిగెట్టారు. చిన్నారులను చంకన వేసుకుని ఊపిరి ఎక్కువగా తీసుకుని మరీ అయాసం వస్తున్నా పరుగు ఆపలేదు. అదే ఇప్పుడు చిన్నారులను కాపాడింది. పెద్ద వారి ప్రాణాలు తీస్తోంది.

ఊపిరి తక్కువగా తీసుకోవడం వల్ల దాదాపు 52మంది చిన్నారులు ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు మండడం వంటివి ఇబ్బంది పెడుతున్నా ప్రమాదం పొంచి ఉందన్న భయంతో పరుగు తీసిన పెద్దలు అలసిపోయారు. వారికి తెలియకుండానే విషవాయువుని ఎక్కువ మొత్తంలో పీల్చేశారు. సాధారణంగా నడిచేటప్పటి కంటే పరుగు పెట్టేటప్పుడు ఎక్కువ ఊపిరి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో పిల్లల్ని ఎత్తుకుని పరుగులు తీయడంతో శ్వాస మరింత కష్టంగా మారింది.

అందుకే ఎక్కువ శాతం ప్రమాదం బారిన పడిన పెద్ద వారు కోలుకోవడం కొందరికి కష్టమైతే, మరికొందరికి ఆలస్యమవుతుంది. కాగా, వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న చిన్నారులు కనీసం ఐదురోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండి అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తున్నాయని నిర్ధారించుకున్నాకే డిశ్చార్జ్ చేస్తామన్నారు. పిల్లలు సాధారణ శ్వాస తీసుకోవడంతో విషవాయువు ప్రభావం వారిపై తక్కువగా పడిందని పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్ వైద్యులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story