మైక్‌లో చెప్తున్నా వినరా.. అయితే నల్ల కనెక్షన్ కట్..

మైక్‌లో చెప్తున్నా వినరా.. అయితే నల్ల కనెక్షన్ కట్..
X

ప్రభుత్వం తాగమనే చెప్తది. వాళ్లకి ఆదాయం కావాలి మరి. మీ బుద్దేమైంది. ఆరోగ్యం పాడవుద్ది.. ఆలితో పాటు బిడ్డలు రోడ్డు మీద ఉంటారు. ఎంత చెప్పినా వినక మద్యం దుకాణం తెరిచి మందు విక్రయించారంటే 10 వేలు జరిమానా కట్టాలి. దాంతో పాటు సంక్షేమ పథకాలన్నీ కట్టవుతాయి అని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామ పంచాయితీ తీర్మానం తీసుకుంది. దాంతో పాటు నల్ల కనెక్షన్ కూడా బంద్ చేస్తామని గ్రామస్తులకు వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయాన్ని గ్రామంలో మైక్ ద్వారా ప్రచారం చేసి మరీ చెబుతున్నారు. గ్రామంలో బెల్ట్ షాపులు నిషేధించినా ఏ మాత్రం పట్టనట్టు మద్యం దుకాణాలు తెరుస్తున్నారని పంచాయితీ పలు చర్యలు ప్రారంభించింది. ఇదే కదా మహాత్ముడు కోరుకున్న గ్రామ స్వరాజ్యం. ఎవరికి వారు వారి ఊరి బాగు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బతుకులూ బాగుంటాయి అని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES