Top

ఏపీలో మరో 43 కరోనా కేసులు..

ఏపీలో మరో 43 కరోనా కేసులు..
X

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,338 మంది శాంపిల్స్ పరీక్షించడా.. అందులో 43 మందికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో రాష్ట్రం మొత్తంలో కేసుల సంఖ్య 1,930కి చేరింది. కొత్తగా కృష్ణా జిల్లాలో 16, చిత్తూరు జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 6, విశాఖ జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 2 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మరణాల సంఖ్య ఇప్పటి వరకు 44 చేరింది. ఇక కోలుకుని ఇళ్లకు వెళ్లిన వాళ్ల సంఖ్య 887 మంది. ప్రస్తుతం రాష్ట్రంలో 999 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నెంబర్ వన్‌లో నిలుస్తుంది. కాగా, ఏపీలో ఇప్పటివరకు 1,65,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Next Story

RELATED STORIES