Top

కర్ణాటక నుంచి ఆంధ్రకు అక్రమ మార్గంలో మద్యం.. పోలీసుల నిఘా

కర్ణాటక నుంచి ఆంధ్రకు అక్రమ మార్గంలో మద్యం.. పోలీసుల నిఘా
X

ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. కర్ణాటక నుంచి భారీగా మద్యం ఆంధ్రకు తరలిస్తున్నారు అక్రమార్కులు. ఈ విషయం తెలుసుకున్న ఎక్స్జైజ్‌ అధికారులు సరిహద్దుల్లో నిఘా పెట్టారు. ఈ మార్గంలో వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీలు చేశారు. పలమనేరు సమీపంలో.. కర్ణాటక నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 9 మందిని అదుపులో తీసుకున్నారు. దాదాపు 50వేల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదు ద్విచక్ర వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి వివిధ మార్గాల్లో కర్ణాటక నుంచి భారీగా మద్యం తరలిస్తుండటంతో.. దీన్ని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామంటున్నారు ఎక్సైజ్‌ అధికారులు.

Next Story

RELATED STORIES