మోదీ గారు మరోసారి.. ఈ సారి టాస్క్!!

మోదీ గారు మరోసారి.. ఈ సారి టాస్క్!!

దేశమంతా ప్రధాని మోదీ చెప్పినట్లు వింటూ కరోనా వ్యాప్తి నిర్మూలనకు సహకరిస్తోంది. లాక్డౌన్ విధించి కేసుల సంఖ్యను తగ్గించడంలో ప్రధాని కీలక పాత్ర వహించారు. ప్రపంచంలోని పలు దేశాలకు ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మెప్పునూ పొందారు. మూడోవిడత లాక్డౌన్ కొనసాగుతున్న తరుణంలో ప్రధాని మోదీ సీఎంలతో సోమవారం మద్యాహ్నం 3 గంటలకు ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్డౌన్ అమలుపై చర్చించడంతో పాటు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరుపుతారు.

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ ఈనెల 17తో ముగియనున్నందున మోదీ సీఎంలతో జరిపే ఈ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 62,939 మందికి కరోనా సోకింది. 19,358 మంది కోలుకున్నారు. 2,109 మంది వైరస్ బారిన పడి మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే నమోదవడం ఆందోళన కలిగిస్తున్న అంశం.

ఈ తరుణంలో ఈ మూడు రాష్ట్రాల సీఎంలు మరింత పగడ్భందీగా ఛర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించే అవకాశం ఉంది. అవరమైతే కేంద్ర బ‌ృందాల సహకారం తీసుకోవాలని మోదీ సీఎంలకు సూచించనున్నారు. లాక్డౌన్ కొనసాగించాలా లేదా అనే అంశంపై కూడా మోదీ చర్చించనున్నారు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే నెలాఖరు వరకూ లాక్డౌన్ పొడిగించాయి. కేంద్రం కూడా రాష్ట్రాలను అనుసరించి లాక్టౌన్ పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story