ఏం చేస్తున్నారో అర్థమవుతోందా.. ప్రజల జీవితాలతో ఆడుకుంటారా: సర్కార్ పై రజనీ ఫైర్

ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే ప్రత్యామ్నాయ మార్టాలు ఆలోచించాలి. అంతే కాని ఇలా మద్యం దుకాణాలు తెరిచి ప్రజల జీవితాలతో చెలగాట మాడుతారా అని అన్నా డీఎంకే సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సూపర్ స్టార్ రజనీకాంత్. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ వేళ మద్యం దుకాణాలు ఓపెన్ చేసింది తమిళ్ సర్కారు. కరోనా వ్యాప్తి కట్టడిలో తీసుకున్న చర్యలేవీ అనుసరించలేదు మందు బాబులు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో విఫలమైంది. ఇదే విషయమై హైకోర్టుకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బెల్టు షాపులు మూసివేయమని ఆర్డర్లు జారీ చేసింది కోర్టు.
కాగా, డీఎంకే సర్కారుకు ఈ విషయం ఏ మాత్రం మింగుడు పడలేదు. దాంతో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా స్టే కోరుతూ పళని సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన రజనీ.. ఇట్లాంటి కిష్ట పరిస్థితుల్లో సర్కారు మద్యం దుకాణాలు తెరవాలని నిర్ణయిస్తే మాత్రం మళ్లీ అధికారంలోకి రావడం కలే అవుతుంది. ఆదాయ మార్గాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించండి అంటూ రజనీకాంత్ ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com