తాజా వార్తలు

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద వలస కూలీల నిరసన

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద వలస కూలీల నిరసన
X

నల్గొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద వలస కూలీలు ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపించాలంటూ వారంతా రోడ్డెక్కి నిరసన చేపట్టారు. దామరచర్ల మండలం వీర్రపాలెంలోని ప్లాంట్‌లో వెయ్యి మందికిపైగా బీహార్, జార్ఖండ్‌కు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా వీరంతా సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలనే నిర్ణయించుకున్నారు. మొదటి విడతలో కొందరిని ప్రత్యేక బస్సుల ద్వారా తరలించారు. మిగతా వారంతా తమను కూడా పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. దశల వారీగా పంపిస్తామని అధికారులు చెప్తున్నా వినిపించుకోవడం లేదు. వందల మంది ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Next Story

RELATED STORIES