క్వారంటైన్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు..

క్వారంటైన్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు..

కట్టుదిట్టమైన భద్రత, కెమెరా కన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి ఎవరూ సాహసించరు. అయినా కరోనా నన్నెవరు ఆపుతారో చూస్తానన్నట్లు వైట్‌హౌస్‌లోకి ఎంటరైంది. భద్రతా సిబ్బందిలోని ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. వైద్య బృందంలోని ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలు.. అలర్జీ, అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ, వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్, ఆహార ఔషధ పరిపాలన విభాగం కమిషనర్ స్టీఫెన్ హాన్‌లు కూడా స్వీయ నిర్భంధంలోకి వెళ్లినట్లు అధికార వర్గాలు

తెలిపాయి. వీరంతా కరోనాపై పోరాటం కోసం ఏర్పాటైన శ్వేతసౌధం కార్యదళంలో కీలక సభ్యులు. అంతకు ముందు ట్రంప్ సహాయకుల్లో ఒకరికి, ట్రంప్ కుమార్తె ఇవాంక సహాయకురాలికి, మీడియా కార్యదర్శి కేటీ మిల్లర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story