నేను బాగానే ఉన్నా.. నాకేం కాలేదు: కేటీఆర్ ట్వీట్

నేను బాగానే ఉన్నా.. నాకేం కాలేదు: కేటీఆర్ ట్వీట్
X

తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. నిన్న సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన మంత్రి జలుబుతో బాధపడుతున్నట్లుగా కనిపించే సరికి ఓ అభిమాని.. సుబ్రమణ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌ను పరామర్శించారు. అసలే బయట పరిస్థితి బాగాలేదు. మీ ఆరోగ్యం జాగ్రత్త అని అన్నారు. అభిమానిని ఆందోళన చెందవద్దని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. తాను బాగానే ఉన్నానన్నారు. సిరిసిల్లలో సోమవారి నాటి పర్యటన సందర్భంగా తనకు అనేక సంవత్సరాలుగా ఉన్న జలుబుకు సంబంధించిన ఎలర్జీ వచ్చిందన్నారు. అప్పటికే పర్యటనకు సంబంధించిన పలు కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నందున ఎవరికీ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని కొనసాగించాల్సి వచ్చిందన్నారు.

Next Story

RELATED STORIES