పిల్లల్ని బడికి పంపాలంటే భయంగా ఉంది: సర్వే రిపోర్ట్

పిల్లల్ని బడికి పంపాలంటే భయంగా ఉంది: సర్వే రిపోర్ట్

జూన్, జూలైల్లో పాఠశాలలు తెరుస్తామంటున్నారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడతూ మా పిల్లల భద్రతకు భరోసా ఇస్తేనే స్కూలుకు పంపిస్తామంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పేరెంట్ సర్కిల్ అనే ఆన్‌లైన్ పేరెంటింగ్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 12 వేల మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. వారిలో 54 శాతం మంది ముంబై నగరానికి చెందిన వారే.

లాక్డౌన్ తర్వాత స్కూళ్లు తెరిచినా అప్పుడే పంపేది లేదని అంటున్నారు ముంబై విద్యార్థుల తల్లిదండ్రులు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పిల్లలను స్కూలుకు పంపి ప్రమాదాన్ని కొని తెచ్చుకోలేమని, ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని అన్నారు. ఆరు నెలల వరకు ఆడుకునేందుకు, బర్త్‌డే పార్టీలకు, ఫ్రెండ్స్‌ని కలుసుకునేందుకు కూడా పంపించమని తల్లిదండ్రులు వెల్లడించారు.

సినిమా హాల్స్, మాల్స్‌కి కూడా ఇప్పట్లో వెళ్లేది లేదని తెలిపారు. మరోవైపు పాఠశాలలు తిరిగి ప్రారంభించే దిశగా విద్యాశాఖ సమాయత్తమవుతోంది. స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకుని స్కూళ్లు తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఆలస్యంగా స్కూళ్లు ప్రారంభిస్తే సిలబస్ తగ్గించడం, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడం వంటి వాటిపై దృష్టి సారిస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story