లాక్డౌన్ పొడిగించండి: పీఎంకి మెజారిటీ సీఎంల సూచన

లాక్డౌన్ పొడిగించండి: పీఎంకి మెజారిటీ సీఎంల సూచన
X

కరోనాని కట్టడి చేయలేకపోతున్నాం. లాక్డౌన్ ఉంటేనే ఇలా ఉంది పరిస్థితి. లేకపోతే రోడ్ల మీద ఎక్కడ చూసినా జనం గుంపులు గుంపులుగా.. ఎలా కరోనాని అదుపు చేయడం అని పలువురు సీఎంలు పీఎం దగ్గర వాపోతున్నారు. మూడో విడత కొనసాగుతున్న లాక్డౌన్.. ఇప్పటికి ఈ లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి పీఎం.. వివిధ రాష్ట్రాల సీఎంలతో ఐదోసారి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మెజారిటీ సీఎంలు లాక్డౌన్ పొడిగించడానికే ఓటు వేస్తున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్, మహారాష్ట్రలు కూడా నెలాఖరు వరకు లాక్డౌన్ అమలు పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా లాక్డౌన్-4పై ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES