మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
X

పీఎం మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 17తో లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ ఐదోసారి చర్చించారు. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రులతో 5వ సారి సాగిన సమావేశంలో అనేక కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు సాగాల్సిన తీరు, ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో మెజారిటీ సీఎంలు లాక్‌డౌన్ కొనసాగించాలని కోరారు. దీంతో మరోసారి లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story

RELATED STORIES