ఏటిఎంలో జాగ్రత్త .. ఎస్‌బీఐ హెచ్చరిక

ఏటిఎంలో జాగ్రత్త .. ఎస్‌బీఐ హెచ్చరిక

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్నవారికి కొన్ని జాగ్రత్తలు చెబుతోంది బ్యాంకు. మీరు మీ ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేయడానికి వెళ్తున్నట్లైతే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించమంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఏటీఎం కేంద్రంగా మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది బ్యాంకు.

ఎస్బీఐ తన కస్టమర్లకు అందిస్తున్న సేప్టీ టిప్ప్..

మీరు డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎంకు వెళ్లినప్పుడు మీ పిన్ నెంబర్ ఎవరూ చూడకుండా జాగ్రత్తపడండి. ఓ చేత్తో పిన్ ఎంటర్ చేస్తూ మరో చేయిని అడ్డుగా పెట్టండి.

మీ పిన్ నెంబర్ ఎక్కడా రాయకూడదు. ఎవరికీ చెప్పకూడదు.

మీ బర్త్‌డే, పెళ్లి రోజు, మీ వెహికల్ నెంబర్ లాంటివి పిన్ నెంబర్లుగా పెట్టకూడదు.

ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ స్లిప్‌ను మీతో పాటు తీసుకెళ్లాలి. ఓసారి చెక్ చేసుకున్న తరువాత ఆ స్లిప్ చింపేయాలి.

ఏటీఎంలో స్కిమ్మింగ్ డివైజ్, సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమో గమనించాలి.

ఎస్‌బీఐ మిస్డ్ కాల్ ఆప్షన్ ద్వారా మీ ట్రాన్సాక్షన్ వివరాలు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.

ఓటీపీ,డెబిట్ కార్డ్ పిన్, మీ బ్యాంకు అకౌంట్ వివరాలు ఎవరికీ షేర్ చేయవద్దు.

మీ ఏటీఎం పిన్, ఇతర వివరాలు అడుగుతూ ఎవరైనా ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ పంపినా, కాల్ చేసినా వివరాలు వెల్లడించవద్దు.

ఏటీఎం లోపలికి వెళ్లే ముందు అక్కడ ఎవరైనా ఉన్నారేమో గమనించాలి. ఏటీఎం లోపలికి ఒకరు మాత్రమే వెళ్లాలి.

ఏటీఎంలో మీరు డబ్బులు డ్రా చేసే సమయంలో ఎవరైనా ఉంటే మీ కార్డు వివరాలు, పిన్ వారు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story