మాతృదినోత్సవం రోజు అమ్మకాని అమ్మకు జేజేలు పలికిన చిరంజీవి.. వీడియో సంభాషణ

మాతృదినోత్సవం రోజు అమ్మకాని అమ్మకు జేజేలు పలికిన చిరంజీవి.. వీడియో సంభాషణ

మాతృదినోత్సవం రోజు మన అమ్మ గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. అందులో ఆనందం ఉంటుంది అది మామూలే. కానీ అమ్మకు మించిన ఆప్యాయతను పంచింది ఓ తల్లి.. ఆమే ఒడిశాకు చెందిన పోలీస్ అధికారిణి శుభశ్రీ. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ రోడ్డు పక్కన మానసిక పరిస్థితి సరిగా లేని వృద్ధురాలికి అన్నం తినిపించిన ఘటన నన్ను ఆమెతో మాట్లాడేలా చేసింది. ఆ దృశ్యం చూసి మానవత్వం నిండిన మాతృమూర్తి శుభశ్రీకి జేజేలు పలకాలనిపించింది అని చిరంజీవి ఆమెతో సంభాషించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

చిరంజీవి: గుడ్‌మార్నింగ్ శుభశ్రీ జీ..

శుభశ్రీ: నమస్తే సర్

చిరంజీవి: కొన్ని రోజుల క్రితం వీడియో ఒకటి చూశాను. అందులో మీరు రోడ్డుపక్కన మానసిక స్థితి సరిగా లేని ఓ వృద్ధ మహిళకు అన్నం తినిపిస్తున్నారు. అది నా మనసుని తాకింది. ఆ రోజు నుంచి మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా. ఆ వ్యక్తి పట్ల అంత కృతజ్ఞత చూపించినందుకు మిమ్మల్ని అభినందించాలనుకుంటున్నాను.

శుభశ్రీ: చాలా సంతోషం సర్..

చిరంజీవి: నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీకు ఎందుకు అలా చేయాలనిపించింది.

శుభశ్రీ: నేను ప్రత్యేకించి చేసిందేమీ లేదు సర్. అమె అన్నం ఇస్తే తీసుకుని తినే పరిస్థితి లేదు. ఆమెకి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పాటు అంగవైకల్యం కూడా ఉంది.

చిరంజీవి: మీలో సానుభూతి నిండిన ఓ తల్లి హృదయాన్ని చూశాను

శుభశ్రీ: ధన్యవాదాలు సర్

చిరంజీవి: ఇది ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. మీకు తప్పకుండా ఎన్నో ప్రాంతాల నుండి, ఎంతో మంది నుండి అభినందనలు అందుకుని ఉంటారు.

శుభశ్రీ:అవును సర్. మా గౌరవ ముఖ్యమంత్రి దీని గురించి ట్వీట్ చేశారు. అంతేకాక మా ఏడీజీపీ అరుణ్ సలోంజి సర్ ఎప్పుడూ చెబుతుంటారు. బాధ్యత నిర్వర్తించడం అంటే లా అండ్ ఆర్డర్ ఒక్కటే కాదు. పౌరులకు ఎలాంటి అవసరం వచ్చినా మేం ఉన్నామన్న భరోసా ఇవ్వాలని అని చెబుతుంటారు. అది నాకొక రివార్డు. సర్ నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మళ్లీ మర్చిపోతాను. మీరొక మెగాస్టార్ మాత్రమే కాదు. గొప్ప సామాజిక సేవకులు. మీరు చేసిన ఎన్నో కార్యక్రమాలు చూశాను. నేను మీ అభిమానిని.

చిరంజీవి: థ్యాంక్యూ అమ్మా

శుభశ్రీ:మీ వ్యక్తిత్వం నాకు ఎంతో ఇష్టం

చిరంజీవి: మీతో మాట్లాడడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది

శుభశ్రీ:నాకు కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది

చిరంజీవి: ఇలాంటి మంచి పనులు మీరు ఇంకా చేస్తుండాలి. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలి

శుభశ్రీ:మీ ఆశీర్వాదానికి కృతజ్ఞతలు సర్‌

చిరంజీవి: మిమ్మల్ని భగవంతుడు చల్లగా చూడాలి

శుభశ్రీ:థ్యాంక్యూ సర్.

Tags

Read MoreRead Less
Next Story