Top

కేజీహెచ్‌లో మంత్రి అవంతి శ్రీనివాస్‌కు చేదు అనుభవం

కేజీహెచ్‌లో మంత్రి అవంతి శ్రీనివాస్‌కు చేదు అనుభవం
X

విశాఖ కేజీహెచ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి అవంతి శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆస్పత్రిలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ను స్టైరిన్‌ గ్యాస్‌ బాధితులు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. తమను పట్టించుకోవడం లేదంటూ బాధితులు మంత్రి ముందు అసహనం వ్యక్తం చేశారు. మంత్రితో వాగ్వాదానికి దిగారు. సర్దిచెప్పేందుకు మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఎంత ప్రయత్నించినా బాధితులు వినలేదు. ప్రమాదం జరిగిన రోజు సీఎం జగన్‌ ఇచ్చిన మాటకు.. ఈరోజు చేపడుతున్న చర్యలకు సంబంధం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం న్యాయం చేయకుంటే గ్రామాల్లో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు మంత్రి అవంతి ముందు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES