వర్క్ ఫ్రమ్ హోం.. ఇదే కంటిన్యూ చేయాలని..

వర్క్ ఫ్రమ్ హోం.. ఇదే కంటిన్యూ చేయాలని..

కరోనా వ్యాప్తి నిర్మూలనకు లాక్డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో ఐటీ కంపెనీలతో సహా దాదాపు అన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులు బాటు కల్పించారు. ఈ పద్ధతి ఐటీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, ఇప్పుడు ఏకథాటిగా 45 రోజులకు పైగా ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయినా సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రముఖ ఐటీ కంపెనీ ఎండీ పేర్కొన్నారు. కోవిడ్ వల్ల బాగా కుంగిపోయిన రిటైల్, ఆతిథ్యం, విమానయానం వంటి కొన్ని రంగాల నుంచి గతంలో మాదిరిగా ప్రాజెక్టులు రాకపోవచ్చని, ఈ రంగాలు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని అన్నారు.

ఐటీ రంగంలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. ఇతర రంగాలతో పోలిస్తే ఐటీ రంగం కాస్త మెరుగ్గానే ఉందని అన్నారు. వర్క్ ఫ్రమ్ హోం వలన ఐటీ కార్యకలాపాలు కొనసాగించ వెసులుబాటు కలిగిందన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిందన్నమాట వాస్తవం అన్నారు. లాక్డౌన్ వేళ సిబ్బంది సహకారంతో ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగామని అన్నారు. అయితే కొత్త ప్రాజెక్టులు వచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదు. కోవిడ్-19కు వ్యాక్సిన్ వస్తే పరిస్థితి కాస్త మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలో వర్క్ ఫ్రమ్ హోం అంటే వెనుకాడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఇదే బాగుందనిపిస్తోంది. ఈ పధ్ధతి ఇక ముందు కూడా కొనసాగించాలనుకుంటున్నాం అని అన్నారు. సైబర్ భద్రత, ఐపీ భద్రత వంటి సమస్యలను పరిష్కరించగలిగితే ఈ విధానంలోనే ప్రాజెక్టులు నిర్వహించవచ్చని అన్నారు. భవిష్యత్ కార్యకలాపాల తీరు సమూలంగా మారిపోనుందని అన్నారు. ఇక ఐటీ ఇండస్ట్రీ కూడా ఉద్యోగస్తులను తగ్గించే పనిలో పడింది.

Tags

Read MoreRead Less
Next Story