ఆవ భూముల కుంభకోణంపై టీవీ5 కథనాలకు స్పందన :

ఆవ భూముల కుంభకోణంపై టీవీ5 కథనాలకు స్పందన :

తూర్పుగోదావరి జిల్లాలో ఆవ భూముల కుంభకోణంపై టీవీ5 ప్రసారం చేసిన వరుస కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ విపక్షాలు సైతం ఉద్యమానికి సిద్ధమయ్యాయి. భూములను పరిరక్షించాలంటూ సీఎం జగన్‌కు టీడీపీ, బీజేపీ నేతలు లేఖ రాశారు. ఆవ భూముల వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని రాజమండ్రి రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లేఖలో డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఆవ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తే పర్యావరణానికి, అక్కడ నివసించే వారికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దగా సీఎంకు ఉందన్నారు. తక్షణమే ఈ భూముల వ్యవహారంపై స్పందించి విచారణ జరపాలని కోరారు.

కోరుకొండలోని భూముల కొనుగోళ్లలో అవినితి జరిగిందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రాజమండ్రి వద్ద ముంపు ప్రాంతాన్ని పేదల కోసం సబ్‌ కలెక్టర్‌ ఎంపిక చేశారని.. చిన్న వర్షానికే ఈ ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది నివాసయోగ్యం కాదన్నారు. 25 లక్షల భూమిని 45 లక్షలకు కొనడం ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ సీఎంకు లేఖ రాశారు. అవకతవకలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story