కరోనా ఎఫెక్ట్.. విదేశాల్లో చదువులకు ఫుల్‌స్టాప్ పడినట్లేనా..

పై చదువుల కోసం అమెరికా లేదా మరో దేశం వెళ్లాలన్న ఆశలు కరోనా వల్ల కల్లలుగా మిగిలిపోనున్నాయా.. ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనతో విదేశాల్లో చదువు పట్ల ఆసక్తి తగ్గిపోవచ్చు ఇటు తల్లిదండ్రులకి అటు విద్యార్థులకి. వివిధ దేశాల్లో ఆగస్టులో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి డిసెంబరు-జనవరి నుంచి విద్యార్థులకు ఐ-20 ప్రవేశానుమతి పత్రాలు రావడం మొదలవుతుంది.
దాదాపుగా వివిధ దేశాల్లో ఉన్న విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. మనదేశం నుండి ప్రతి ఏటా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ దేశాలకు వెళుతుంటారు. అందులో సుమారు 25 వేల మంది అమెరికా వైపు మొగ్గు చూపుతారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 వేల మంది విదేశీ విద్యనభ్యసిందేకు వెళుతుంటారని అంచానా. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఇదిలా ఉండగా అమెరికా, యూకేలలో వైరస్ తీవ్రత ఇంకా తగ్గలేదు. ఆగస్టు నాటికి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అదే సమయంలో అమెరికాలోని విశ్వ విద్యాలయాలకు ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహాయంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ విద్యార్థుల నుంచి కూడా అధిక ఆదాయం లభిస్తుంది. వర్శిటీల నిర్వహణ ముఖ్యంగా ఈ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. విద్యాసంస్థలు ప్రారంభమయ్యాకే పరిస్థితులను అంచనా వేయగలుగుతామని పలు విశ్వవిద్యాలయ అంతర్జాతీయ ప్రతినిధుల అభిప్రాయం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com