వెంటిలేటర్‌‌లో మంటలు.. కరోనా బాధితులు మృతి

వెంటిలేటర్‌‌లో మంటలు.. కరోనా బాధితులు మృతి
X

రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఐసీయూలోని వెంటిలేటర్ లోని సాంకేతిక లోపం వలన పలువురు కరోనా బాధితులు మృతి చెందారు. వెంటిలేటర్ లో మంటలు రావటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. వెంటిలేటర్ల సామార్థ్యానికి మించి వాటిని వినియోగించాల్సి వస్తోందని.. దీంతో పరికరంపై ఒత్తిడి పెరిగి ఓవర్ లోడ్ అయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో.. ఒక్కసారిగా అందులో మంటలు చెలరేగడంతో వాటిపై ఉన్న కరోనా బాధితులు మృతి చెందారని తెలిపారు. ఈ విషయాన్ని రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. కానీ, మృతుల సంఖ్య మాత్రం ప్రకటించలేదు. ఈ ఘటన సమాచారం అందగానే ఆస్పత్రి నుంచి తక్షణం 150 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించామని ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Next Story

RELATED STORIES