Top

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డ్‌ సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డ్‌ సమావేశం
X

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డ్‌ సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కృష్ణా రివర్‌ బోర్డు మీటింగ్‌ జరగనుంది. కృష్ణా బేసిన్‌లో లభ్యమయ్యే మిగులు జలాలపై బోర్డు చర్చించనుంది. టెలీమెట్రీ విధానం, ఇప్పటి వరకు వాడుకున్న జలాల లెక్కలతో పాటు..రెండు రాష్ట్రాలు మిగులు జలాలు ఎలా వినియోగించుకోవాలి అన్నదానిపై నిపుణుల కమిటీ చర్చించనుంది. అనంతరం ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయనుంది కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. దీనిపై కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ను నేరుగా కలిసి వివరించాలని ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌తో భేటీ కానున్నారు ఇరిగేష్‌ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203పై ఫిర్యాదు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం ద్వారా.. ఏ విధంగా నీటిని తరలించాలనుకుంటుందో వివరించనున్నారు. మరోవైపు 203 జీవోపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.

Next Story

RELATED STORIES