ఆ వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించడమే నా లక్ష్యం : కేటీఆర్

ఆ వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించడమే నా లక్ష్యం : కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా నేత కార్మికులు ఉత్పత్తి చేస్తోన్న వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించడమే తన లక్ష్యమంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు మంత్రి కేటీఆర్‌. లాక్‌డౌన్‌ కారణంగా పట్టణంలోని పవర్‌లూమ్‌ పరిశ్రమ కొంతకాలం మూతపడింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో.. ఇటీవలే దీన్ని ప్రారంభించారు. దీంతో.. కార్మికులు.. బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌.

సిరిసిల్లకు చెందిన ప్రతిభావంతమైన నేత కార్మికులు... బతుకమ్మ చీరల ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారని, స్థానిక ఎమ్మెల్యేగా సిరిసిల్లలో ఉత్పత్తైన వస్త్రానికి ప్రత్యేక బ్రాండ్‌ ఇమేజ్‌ సృష్టించడమే తన లక్ష్యమన్నారు. ఈ లక్ష్యసాధనలో టెక్స్‌టైల్‌ పార్క్‌, అపెల్‌ పార్క్‌ కీలక పాత్ర పోషించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story