రూటు మార్చిన స్మగ్లర్లు.. అరటికాయల లోడులో గుట్కా, ఖైనీ తరలింపు

X
TV5 Telugu13 May 2020 3:16 PM GMT
లాక్‌డౌన్ సమయంలో స్మగ్లర్లు రూటు మార్చారు. గుంటూరులో నిషేధిత గుట్కా, ఖైనీ రవాణాను దొంగ దారిన తరలిస్తూ పట్టుబడ్డారు. గుట్టుచప్పుడు కాకుండా అరటికాయల లోడులో తరలిస్తున్న గుట్కా, ఖైనీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7 లక్షలకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు నుంచి గుంటూరుకు తరలిస్తుండగా వీటిని పట్టుకున్న పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Next Story