రష్యాలో కరోనా.. మొన్న అధ్యక్షుడికి.. ఈ రోజు అధికార ప్రతినిధికి..

రష్యాలో కరోనా.. మొన్న అధ్యక్షుడికి.. ఈ రోజు అధికార ప్రతినిధికి..

మొన్న అధ్యక్షుడు, ఈ రోజు అధికార ప్రతినిధి కరోనా వైరస్ బారిన పడ్డారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కరోనా బారిన పడ్డారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో రష్యా విజయవంతమైందని అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన మరుసటి రోజే అయన అధికార ప్రతినిధికి వైరస్ సోకింది. 52 ఏళ్ల పెస్కోవ్ 2008 నుంచి పుతిన్‌ ముఖ్య సహాయకుడిగా కొనసాగుతున్నారు. ఇక పెస్కోవ్ ఏప్రిల్ 30 న చివరి సారిగా పుతిన్‌తో కలిసి ఓ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సడలించినా వ్యాధి లక్షణాలు కనిపించిన వారు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది. అధ్యక్షుడు పుతిన్ గత కొన్ని వారాలుగా తన సమావేశాలన్నింటినీ టెలీకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. కాగా, రష్యాలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు 2,32,000 ఉంటే 2100 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story