ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంకు ఏపీ సర్కార్‌ మళ్లీ గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంకు ఏపీ సర్కార్‌ మళ్లీ గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంకు ఏపీ సర్కార్‌ మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ విద్యాసంవత్సరం నుంచే ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనుంది. దీన్ని దశలవారీగా పదో తరగతి వరకు పెంపుదల చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని.. తాజాగా SCERT సిఫార్సు చేసింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కూడా అవే ప్రతిపాదనలు చేయడంతో.. ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 672 మండల కేంద్రాల్లో తెలుగు మీడియం స్కూళ్ల ఏర్పాటు చేయనున్నారు. తెలుగు మీడియంలో చేరే దూరప్రాంత విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఐతే.. ఒక్కో విద్యార్థికి 6 వేల రూపాయల చొప్పున ఖర్చవుతుందని అంచనా వేశారు. దీని కోసం 32 కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయించినట్లు SCERT తెలిపింది. రాష్ట్రంలోని ఉర్దూ, తమిళం, కన్నడం, ఒరియా స్కూళ్లు యధాతథం ఉండనున్నాయి. ఆంగ్ల మాధ్యమం తరగతులకు సమాంతరంగా ఇవి కొనసాగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story