పది, ఇంటర్ పరీక్షలు రద్దు..

పది, ఇంటర్ పరీక్షలు రద్దు..

దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలైంది.. అంతలోనే కరోనా కలకలం సృష్టించింది. దాంతో రాత్రికి రాత్రి లాక్డౌన్ ప్రకటించింది కేంద్రం. దీంతో విద్యార్థుల పరీక్షల నిర్వహణ ఆగిపోయింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న ఆశతో కొన్ని రాష్ట్రాలు పరీక్షల తేదీలను ప్రకటించాయి. జూన్, జులై మొదటి వారాల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story