కరోనా ఎఫెక్ట్.. జడ్డిలకు కొత్త డ్రెస్‌కోడ్

కరోనా ఎఫెక్ట్.. జడ్డిలకు కొత్త డ్రెస్‌కోడ్

కరోనా వైరస్‌కి నలుపంటే చాలా ఇష్టం. మరి కోర్టుకి నల్ల కోటు వేసుకుని వస్తే వైరస్ మిమ్మల్ని త్వరగా పట్టుకుంటుంది. అందుకే నల్ల కోటు, నల్ల గౌను వేసుకోవద్దు, ఆ డ్రెస్ స్థానంలో కొత్త డ్రెస్ కోడ్ ప్రకటిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబడే తెలిపారు. బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు తెల్ల షర్టులు, నెక్ బ్యాండులతో బెంచ్ మీదకు వచ్చారు.

మీరు ధరించిన ఆ నల్ల కొటు, గౌను పక్కన పెట్టండి వైరస్ త్వరగా పట్టుకుంటుంది అని ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ బోబడే అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇన్ని రోజులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపడుతూ వచ్చిన న్యాయమూర్తులు మంగళవారం నుంచి మళ్లీ కోర్టుకు వస్తున్నారు. వచ్చే వారం నుంచి కోర్టులోనే విచారణలు చేపడతామని, న్యాయవాదులు మాత్రం చాంబర్ నుంచి వాదనలు వినిపించాలని న్యాయమూర్తి నాగేశ్వరరావు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story