టాలీవుడ్ యువ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు
X

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ వివాహమాడాడు. మే14 గురువారం ఉదయం 6.31 గంటలకు శుభ ముహూర్తాన నిఖిల్‌, డాక్టర్‌ పల్లవీ వర్మ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌ నగర శివార్లలో షామీర్‌పేట్‌లోని ఒక రిసార్ట్‌లో వధూవరుల కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో నిఖిల్‌ ఏడడుగులు వేశారు.

హీరో నిఖిల్ డాక్టర్ పల్లవి వర్మకు కొన్నేళ్ల నుంచి పరిచయం ఉంది. నిఖిల్ తన ప్రేయను వ్యక్తం చేయగా పల్లవి వర్మ ఓకే చెప్పేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో గోవాలో కొందరు సన్నిహితుల మధ్య ఎంగేజ్ మెంట్ జరిగింది. ఏప్రిల్‌ 16న ఎంతో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని నిఖిల్ ఆశపడ్డాడు. కానీ కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో పెళ్లి వాయిదా వేసుకున్నారు. వధూవరుల జాతకాల రీత్యా గురువారం ఉదయం ముహూర్తం బావుండడంతో ప్రభుత్వం సూచించిన పద్దతుల్లో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.

Next Story

RELATED STORIES