కరోనా వైరస్.. హెచ్‌ఐవీ మాదిరిగా ఎప్పటికీ.. : డబ్ల్యూహెచ్‌ఓ

X
TV5 Telugu14 May 2020 3:50 PM GMT
హెచ్‌ఐవీ వైరస్ లాగే కరోనా వైరస్ కూడా మనతోనే జీవిస్తుంది. వైరస్ ఎప్పటికీ పోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైక్ ర్యాన్ చెప్పారు. కరోనా వైరస్ కూడా మనుషులతో మమేకమవుతూ మనతోనే కలిసి జీవిస్తుందని, స్థానిక వైరస్‌గా రూపాంతరం చెందుతుందని డాక్టర్ ర్యాన్ వ్యాఖ్యానించారు. హెచ్ఐవీ ప్రపంచం నుంచి ఎప్పుడు మాయమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. కరోనా కూడా దానిలాగే అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్ కనుగొనేంత వరకు ఈ పరిస్థితి తప్పదని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్‌తోనే కరోనాను నివారించగలుగుతామని ర్యాన్ చెప్పారు.
Next Story