Top

నిన్న జీరో బుకింగ్స్.. ఈ రోజు 5000 ఆర్డర్స్.. జోరందుకున్న కార్ల అమ్మకాలు..

నిన్న జీరో బుకింగ్స్.. ఈ రోజు 5000 ఆర్డర్స్.. జోరందుకున్న కార్ల అమ్మకాలు..
X

లాక్డౌన్ సంక్షోభం నుంచి తేరుకునేందుకు సమయాత్తమవుతున్నాయి కంపెనీలు. గత నెలలో జీరో అమ్మకాలతో కుదేలైన మారుతి తాజాగా ఆన్‌లైన్ విక్రయాల్లో జోరందుకుంది. లాక్డౌన్ సడలింపులను సద్వినియోగం చేసుకుంటోంది. ఇప్పటికే 5000 ఆన్‌లైన్ బుకింగ్‌లను సాధించింది. అలాగే 2300 కార్లను డీలర్లకు పంపించింది. కరోనా నిబంధనలను పాటిస్తూనే బుక్ చేసుకున్న కార్లను వినియోగ దారులకు సకాలంలో అందజేస్తామని మారుతి సుజుకి యాజమాన్యం ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా మూసివేసిన 1900 వర్క్‌షాప్‌లు తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించాయని సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ వెల్లడించారు. తమకు వినియోగదారుల నుంచి భారీ మద్ధతు లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES