సొంతూరి ప్రయాణంలో ప్రాణాలు కోల్పోతున్న వలస కూలీలు

సొంతూరి ప్రయాణంలో ప్రాణాలు కోల్పోతున్న వలస కూలీలు
X

లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి సొంతూరికి ప్రయాణమైన వలస కూలీలను రోడ్డు ప్రమాదాలు బలితీసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది వలస కూలీలు ప్రాణాలు కొల్పోయారు. మధ్యప్రదేశ్ లో వలస కూలీలు ప్రయాణిస్తున్న లారీని ఓ బస్సు ఢికొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 50 మందికి గాయాలయ్యాయి. యూపీకి చెందిన వలస కూలీలు మహారాష్ట్ర నుంచి ఓ లారీలో బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మరో ప్రమాదంలో బీహార్ కు చెందిన ఆరు వలస కూలీలు మృతి చెందారు. వీళ్లంతా పంజాబ్ నుంచి తమ స్వస్థలాలకు బయల్దేరారు. అయితే.. యూపీకి చెందిన ఆర్టీసీ బస్సు వలస కూలీలపై దుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

Next Story

RELATED STORIES