విశాఖ కేజీహెచ్‌లో తీవ్ర ఉద్రిక్తత

విశాఖ కేజీహెచ్‌లో తీవ్ర ఉద్రిక్తత
X

విశాఖ కేజీహెచ్‌లో ఉద్రిక్తత నెలకొంది. రోగుల కోసం కంపెనీ పంపించిన భోజనాలను కరోనా పేరుతో కేజీహెచ్‌ సిబ్బంది అడ్డుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎల్జీ పాలిమర్స్‌ బాధితులు. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ ఆందోళనకు దిగారు. మమ్మల్ని బంధించారని.. న్యాయం చేస్తానన్న సీఎం జగన్‌కు తమ బాధ తెలియాలన్నారు. తమను కంపెనీ వద్దకు పంపించాలని, యాజమాన్యంతోనే తేల్చుకుంటాంటున్నారు బాధితులు. న్యాయం దొరక్కపోతే అక్కడ ఆత్మహత్య చేసుకుంటామన్నారు. బాధితుల ఆందోళనతో కేజీహెచ్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి.

Next Story

RELATED STORIES