అప్పులు చెల్లిస్తా.. కేసులు కొట్టేయండి: మాల్యా

తనపై ఉన్న కేసులన్నీ కొట్టేయాలని, తీసుకున్న రుణం మొత్తం 100 శాతం చెల్లించేస్తానని ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ మాల్యా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని తీసుకు వచ్చిన భారత ప్రభుత్వాన్ని అభినందించిన మాల్యా, తన బకాయిలను తిరిగి చెల్లించడానికి పదే పదే ఇచ్చే ఆఫర్లను భారత్ తిరస్కరిస్తోందని వాపోయారు. కోవిడ్-19 ఉపశమన ప్యాకేజీకి సంబంధించి ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ, వారైతే కోరుకున్నంత కరెన్సీని ముద్రించవచ్చు.
కానీ ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ రుణాలు 100 శాతం తిరిగి చెల్లించే నాలాంటి వారిని మాత్రం విస్మరిస్తారా అని మాల్యా ట్వీట్ చేశారు. బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మనీలాండరింగ్ ఆరోపణలపై 2016లో భారతదేశం నుంచి పారిపోయి లండన్ వెళ్లారు. ప్రస్తుతం ఆయన్ను తిరిగి స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా బ్రిటన్ హైకోర్టులో మాల్యా చేసిన అప్పీల్‌ను అక్కడి కోర్టు కొట్టి వేసింది. దాంతో ఆయన అక్కడి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com