ఎల్జీ పాలిమర్ దుర్ఘటన జరిగి వారం గడిచినా.. ఇంకా భయం గుప్పిట్లోనే గ్రామస్తులు

ఎల్జీ పాలిమర్ దుర్ఘటన జరిగి వారం గడిచినా.. ఇంకా భయం గుప్పిట్లోనే గ్రామస్తులు

విశాఖలోని ఎల్జీపాలిమర్ దుర్ఘటన జరిగి వారం గడిచింది. ఇవాళటి రోజే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వారం రోజులు గడిచినా బాధిత ఐదు గ్రామాల్లో జనం భయం గుప్పిట్లోనే జీవిస్తున్నారు. స్టైరిన్ గ్యాస్ నిల్వలను తరలించినా పొగచూరిన ఇళ్లు, ఎండిపోయిన చెట్లే అక్కడ దర్శనమిస్తున్నాయి. గ్యాస్ ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టినా దానిఫలితం అంతగా కనిపించడంలేదు. జనం ఇళ్లకు రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఒకవేళ సాహసం చేసి ఇంటికి చేరుకున్నా.. ఇంట్లోని తిండిగింజలు, ఆహార పదార్ధాలు విషతుల్యమైపోవడంతో.. కరువుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కెజిహెచ్ లో చికిత్స పొందుతున్న కొంతమంది బాధితులను అధికారులు బలవంతంగా తరలిస్తున్నారు. కేజీ హెచ్ లో ఉన్న మరికొంతమందికి ఇంకా నష్టపరిహారం అందనేలేదు. గ్యాస్ పీడిత ప్రజలు పగలంతా గ్రామంలో తిరిగినా.. రాత్రివేళ మాత్రం పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిందే. గ్యాస్ ప్రభావం కారణంగా ఉన్న ఊరు విషతుల్యం కావడంతో గ్రామస్తులు తట్టుకోలేక పోతున్నారు. తమ గ్రామాల్లో పాలుకూడా తాగలేని పరిస్థితి ఏర్పడంటంతో చిన్నపిల్లలు, వృద్దుల పరిస్థితి మరీ దయనీంగాయ మారింది.

Tags

Read MoreRead Less
Next Story